పేకాట స్థావరంపై దాడి.. పట్టుబడ్డ ఓ రాజకీయ పార్టీ నాయకులు, రియల్టర్లు..?

by Bhanu |

పేకాట స్థావరంపై శామీర్ పేట్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరంపై దాడి.. పట్టుబడ్డ ఓ రాజకీయ పార్టీ నాయకులు, రియల్టర్లు..?
X

దిశ,మేడ్చల్ బ్యూరో : పేకాట స్థావరంపై శామీర్ పేట్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. మేడ్చల్ జిల్లా, శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సెలెబ్రిటీ రిసార్ట్స్ లో గల ఓ విల్లాలో సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో శామీర్ పేట్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ రాజకీయ పార్టీ నాయకులతో పాటు ప్రముఖ రియల్టర్లు మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుండి సుమారు రూ. 6 లక్షల నగదుతో పాటు లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు, 4 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు కిలో మీటర్ దూరంలో..

కాగా ఈ పేకాట స్థావరం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు కిలో మీటర్ దూరంలోనే ఉండటం గమనార్హం. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్ - హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న సెలెబ్రిటీ రిసార్ట్ లోని ఓ విల్లాలో జూదరులు పేకాట ఆడటం, సోమవారం రాత్రి పేకాట రాయుళ్ళను పట్టుకున్న కేసు వివరాలను శామీర్ పేట్ పోలీసులు గోప్యంగా ఉంచడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story