ఇదెక్కడి దారుణం.. మొదటి రాత్రి ముట్టుకోలేదని.. భర్తపై భార్య ఫ్యామిలీ దాడి

by Sujitha Rachapalli |

బెంగళూరులో వింత కేసు వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లి అయిన వరుడు.. పని ఒత్తిడితో వధువుతో మొదటి రాత్రి శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత వారాల్లో కూడా అలాగే జరిగింది. దీంతో ఆయన నపుంసకుడని.. రెండు కోట్లు చెల్లించాలని పంచాయితీ

ఇదెక్కడి దారుణం.. మొదటి రాత్రి ముట్టుకోలేదని.. భర్తపై భార్య ఫ్యామిలీ దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో వింత కేసు వెలుగులోకి వచ్చింది. కొత్తగా పెళ్లి అయిన వరుడు.. పని ఒత్తిడితో వధువుతో మొదటి రాత్రి శారీరక సాన్నిహిత్యానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత వారాల్లో కూడా అలాగే జరిగింది. దీంతో ఆయన నపుంసకుడని.. రెండు కోట్లు చెల్లించాలని పంచాయితీ పెట్టిన భార్య ఫ్యామిలీ.. ఆ తర్వాత భర్త ఇంట్లోకి బలవంతంగా చొరబడి దాడికి పాల్పడ్డారు. దీంతో భర్త బెదిరింపులు, గృహ హింస, మర్డర్ అటెంప్ట్ కింద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రవీణ్ కేఎం అనే యువకుడు చందన అనే అమ్మాయిని చిక్కమగళూరు జిల్లా తారీకెరెలో మే నెలలో పెళ్లి చేసుకున్నాడు. కట్నం, ఆచార సంప్రదాయాలన్నీ కూడా ఇరువైపుల కుటుంబాలు పాటించారు. ఈ నూతన వధూవరులు బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్‌లో నివసించారు. అయితే మొదటి రాత్రి వేడుక అమ్మాయి ఇంట్లో జరిగింది. కానీ ఆరోజు వర్క్ ప్రెజర్, ఒత్తిడితో ప్రవీణ్.. చందనకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని వారాలు కూడా అలాగే జరిగింది. దీంతో డౌట్ వచ్చిన చందన వైద్య పరీక్షలు చేయించాలని ఒత్తిడి చేసింది. రిజల్ట్‌లో ఆయన లైంగికంగా బాగానే ఉన్నాడని.. మానసికంగా ఆందోళన కారణంగా.. శారీరకంగా కలిసేందుకు టైమ్ పడుతుందని తేలింది.

రిపోర్ట్ ఇలా ఉన్నా సరే చందన.. ప్రవీణ్ నపుంసకుడని అవమానించడం మొదలు పెట్టింది. పంచాయితీ పెట్టించింది. శారీరకంగా సరిగ్గా లేనందుకు రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఇది బెదిరింపు కిందకు వస్తుందని ఆరోపించాడు ప్రవీణ్. ఈ డిమాండ్ తనను మానసికంగా కుంగదీస్తుందని అన్నాడు. ఈ ఘటన జూన్ 5న జరగ్గా.. ఆగస్టు 17న చందన బంధువులు గోవిందరాజనగర్‌లోని ప్రవీణ్ ఇంట్లోకి బలవంతంగా చొరబడి దాడి చేశారు. ప్రవీణ్‌తో పాటు అతని కుటుంబాన్ని గాయపరిచారు. దీంతో ప్రవీణ్ గోవిందరాజనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story