పదివేలు ఇస్తా నాతో పడుకుంటావా?.. నర్సులను లైంగికంగా వేధించిన వ్యక్తికి దేహశుద్ధి(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-20 13:19:04  IST  )

ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్‌లోని సీఎంఐ హాస్పిటల్‌లో పేషెంట్‌ను చితకబాదారు నర్సులు. రాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పదివేలు ఇస్తా నాతో పడుకుంటావా?.. నర్సులను లైంగికంగా వేధించిన వ్యక్తికి దేహశుద్ధి(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ డెహ్రాడూన్‌లోని సీఎంఐ హాస్పిటల్‌లో పేషెంట్‌ను చితకబాదారు నర్సులు. రాత్రి రెండు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాహుల్ శర్మ అనే 25ఏళ్ల యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనకు అటెండ్‌గా ఉన్న వ్యక్తి తప్పుడు కారణాలతో వార్డ్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. నర్సుల దగ్గరకు వెళ్లి.. అసభ్యకరమైన మాటలు మాట్లాడటం.. తాకడం చేసినట్లు సమాచారం. పదవేలు తీసుకోని నాతోరా అంటూ వేధించడంతో నర్సులు దేహశుద్ధి చేశారు. తాము పని చేసేందుకు వచ్చామని.. ఇలా ఇబ్బంది పడేందుకు కాదని చెంప చెల్లుమనిపించారు. కాగా హాస్పిటల్ సెక్యూరిటీ వికాస్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించగా.. అతన్ని అరెస్ట్ చేశారు.

Next Story