- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలికపై లైంగిక దాడి..ప్రేమ పేరుతో మోసం చేసి
బుద్ధారం గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి, ఆమెను గర్భవతిని చేసిన ఘటన కలకలం రేపింది.

ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడు
పోక్సో చట్టం కింద కేసు నమోదు
బాధితురాలి ఇంటివద్దే ఆన్‌సైట్ FIR నమోదు
దిశ, గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల పరిధిలోని బుద్ధారం గ్రామంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి, ఆమెను గర్భవతిని చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికకు అదే గ్రామానికి చెందిన శ్రీ హరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త, ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరిలో ఆ బాలికకు మాయమాటలు చెప్పి, బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు.
అనంతరం పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో తాను నాలుగు నెలల గర్భవతని తేలింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.






