పిడుగుపాటుకు గురై ఏడుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

by Taduka Kalyani |

పిడుగుపాటుకు గురై ఏడుగురు గాయాలపాలైన సంఘటన మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల పరిధి మురారి దొడ్డి గ్రామంలో మంగళవారం జరిగింది.

పిడుగుపాటుకు గురై ఏడుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, మక్తల్: పిడుగుపాటుకు గురై ఏడుగురు గాయాలపాలైన సంఘటన మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల పరిధి మురారి దొడ్డి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మురదొడ్డి గ్రామంలో ఓ చెట్టుపై పిడుగు పడింది. ఆ సమయంలో చెట్టు కింద ఉన్న రామప్ప (60), అఖిల (10), మమత (11), మనోజ్(8), మధు (6), మల్లయ్య (12) దేవప్ప(32)లకు గాయాలైనాయి. వీరిలో రామప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను రాయచూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story