- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం
తమిళనాడు(Tamil Nadu)లోని తిరుత్తని(Thiruttani) దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని తిరుత్తని(Thiruttani) దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం(Road Accident)లో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు రోడ్డు ప్రమాదాలపై పోలీసులు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. వాహనదారుల్లో మార్పు రావట్లేదు. నిబంధల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ సామాన్య జనాలను పొట్టనపెట్టుకుంటున్నారు.






