- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలక ప్రకటన
కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ (Hyderabad) నుంచి బెంగళూరు (Bengaluru) వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మొత్తం 20 మందికిపైగా సజీవదహనం కాగా.. మరో 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ (SP Vikranth Patil) కీలక ప్రకటన చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని పేర్కొన్నారు. కాసేపట్లో స్పాట్‌కు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంటుందని వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న టూవీలర్ బస్సును బైక్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. పొగను గమనించి స్థానికులు ప్రయాణికులను కాపాడేందుకు బస్సు అద్దాలను పగలగొట్టారని, కొంత మంది బయటపడినా.. మరికొంతమంది బయటకు రాలేకపోయారని తెలిపారు. మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని, రెండో డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు కూడా అంచనా వేయలేకపోయారని తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు కూడా సురక్షితంగా బయటపడ్డారని అన్నారు. అనంతరం క్షతగాత్రులను స్థానికులతో పాటు వాహనదారులు ఆస్పత్రికి తరలించారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు తెలిపారు.
Read More: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. 20 మందికిపైగా సజీవ దహనం!






