- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుక్మా అడవుల్లో సంచలనం.. మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం
అగ్రనేతల లొంగుబాట్లు, కాల్పుల విరమణతో సతమతమవుతోన్నన్న మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రనేతల లొంగుబాట్లు, కాల్పుల విరమణతో సతమతమవుతోన్నన్న మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సుక్మా జిల్లా అడవుల్లో భద్రతా దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని గోంగూడ -కంచాల అడవుల్లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (District Reserve Guard) బలగాలు చేపడుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల ఆయుధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతం నుంచి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాల తయారీ సామగ్రి, పరికరాలను, విప్లవ సాహిత్యాన్ని సైతం స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఆర్డనెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవడాన్ని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్‌జీ దళాలు చేపట్టిన కూబింగ్ ఆపరేషన్‌ను ప్రశంసించారు.
Read More... VIDEO: పట్టపగలే దారుణం.. ప్రేమను అంగీకరించలేదని తుపాకీతో బాలికపై కాల్పులు






