- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొద్దిసేపట్లో స్కూల్‌కు వెళ్లే బాలుడిని బలి తీసుకున్న విద్యుత్
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని మాదన్నపేటలో పదేళ్ల బాలుడు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని మాదన్నపేటలో పదేళ్ల బాలుడు విద్యుత్ షాక్ కి గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మాదన్నపేటకు చెందిన దూడల జ్యోతి, సతీష్‌ల కుమారుడు అభినవ్ (10)అలియాస్ శివ నర్సంపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయాన్నే పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. దగ్గరలో ఓ శుభకార్యం దగ్గర పిల్లలు ఆడుకుంటుండగా అక్కడికి సైకిల్ మీద వెళ్ళినట్లు తెలుస్తోంది. కరెంట్ పోల్ నుండి ఇండ్లకు వచ్చే సర్వీస్ వైర్‌ను అనుకోకుండా పట్టుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ ప్రసారం కావడంతో ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. కొద్ది నిమిషాల్లో పాఠశాలకు వెళ్ళే బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.






