- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ బస్సుకు ప్రమాదం.. 35మంది విద్యార్థులకు గాయాలు
జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి బిష్నా రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 35మంది విద్యార్థులు గాయడపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి బిష్నా రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 35మంది విద్యార్థులు గాయడపడ్డారు. విహారయాత్ర కోసం సాంబా వెళ్లిన విద్యార్థులు తిగిరి వస్తుండగా బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులందరి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే పొగమంచు కారణంగానే రోడ్డు సరిగా కనపడక బస్సు డివైడర్ ను ఢీ కొట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరభారతంలో తరచూ పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.






