అనారోగ్యంతో చికిత్స పొందుతూ స‌ర్పంచ్ మృతి

by Ratna Kumari |   (  Updated:2026-01-21 02:30:49  IST  )

అనారోగ్యంతో చికిత్స పొందుతూ స‌ర్పంచ్ మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బోటితండా గ్రామ‌పంచాయ‌తీలో చోటు చేసుకుంది.

అనారోగ్యంతో చికిత్స పొందుతూ స‌ర్పంచ్ మృతి
X

దిశ‌, కారేప‌ల్లి : అనారోగ్యంతో చికిత్స పొందుతూ స‌ర్పంచ్ మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని బోటితండా గ్రామ‌పంచాయ‌తీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బబోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరామ్(45)ను ప్ర‌జ‌లు ఏక‌గ్రీవంగా స‌ర్పంచ్ గా ఎన్నుకున్నారు. అనారోగ్యం కార‌ణంగా అత‌ను హైద‌రాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో చేరాడు. అయితే ఆయ‌న బుధ‌వారం తెల్ల‌వారుజామున చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ఈలోపే అనారోగ్యం సర్పంచ్ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. తులసిరామ్ మరణ వార్త విన్న బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామస్తులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సర్పంచ్ కుటుంబానికి ప్ర‌గాఢ‌ సానుభూతిని తెలిపారు.

Read More..

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

Next Story