- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంధపు చెట్ల స్మగ్లింగ్ కోసం.. హైదరాబాద్ కు పార్థీ గ్యాంగ్...

దిశ, సిటీక్రైం :హైదరాబాద్ పై పార్థి గ్యాంగ్ కన్నెసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ లోని 23 మంది నగరానికి 20 రోజుల ముందు వలస వచ్చి తిష్ట వేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని గంధపు చెక్కల చెట్లను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్ కొన్నింటిని కోసేసింది. ఈ సంఘటన పై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. మరో 19 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ వారి క్రైం పై ఎవరీకి అనుమానం రాకుండా మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని మొత్తం 23 మంది నగరంలో సంచరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్ లకు చెందిన కొన్ని కుటుంబాలకు చెందిన 23 మంది ఇరవై రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చారు. ఈ గ్యాంగ్ లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ముఠా పై ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా పిల్లలను, మహిళలు వెంటబెట్టుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చి గ్యాంగ్ జూబ్లీహిల్స్ , యూసుఫ్ గూడ్ లోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ క్యాంపస్ ను టార్గెట్ చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించారు. రాత్రి సమయాల్లో గంధపు చెట్టలను నరికి చిన్న , చిన్న గా కట్ చేసి వాటిని ఆటోలలో తీసుకువెళ్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ముఠా నుంచి మొత్తం 10 గంధపు చెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువను అంచనా వేసేందుకు పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు. గంధపు చెక్కల చోరీ కోసమే వచ్చారా లేదా ఇంకా ఇతర నేరాలకు ఏమైనా పాల్పడేందుకు వచ్చారా అనేది బయటపడాల్సి ఉందని పోలీసులు వివరించారు. ప్రస్తుతుం ఈ గంధపు చెక్కల చోరీ పాల్పడ్డ గ్యాంగ్ లోని మహిళ సభ్యులు పళని బాయి, షానాజ్ బాయి, నిమత్ బాయి, మాధురి ఆదివాసి లను అరెస్టు చేశారు మరో 19 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ గంధపు చెట్ల ను వీరి నుంచి ఎవరు కొంటున్నారు, వీరి వెనకాల ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.






