- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంపన్నుల పిల్లలకు డ్రగ్స్ విక్రయం.. ఇద్దరు నిందితులు అరెస్టు
హైదరాబాద్‌లోని సూరారం, కొంపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) స్టేట్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంలో చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన తనఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సంపన్నుల పిల్లలకు డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగర శివార్లలోని సూరారం (Suraram), కొంపల్లి (Kompally) ప్రాంతాల్లో నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన పోలీసులు, డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుంచి 3.24 గ్రాముల, ఎండీఎంఏ, 7.73 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువు బహిరంగ మార్కెట్‌లో రూ.2.58 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా.. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న కోణంలో సరఫరా అవుతున్నాయి? అనే కోణంలో కేసు నమోద చేసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.






