హైకోర్టును ఆశ్రయించిన ‘సాహితీ ఇన్ఫ్రా’

by Gantepaka Srikanth |

సాహితీ ఇన్ఫ్రా లిమిటెడ్‌పై ఈడీ నమోదు చేసిన కేసులలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టును ఆశ్రయించిన ‘సాహితీ ఇన్ఫ్రా’
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాహితీ ఇన్ఫ్రా లిమిటెడ్‌పై ఈడీ నమోదు చేసిన కేసులలో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. హైదరాబాద్ ఈడీ కార్యాలయం అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ప్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి సుమారు రూ.1800కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లక్ష్మినారాయణ కూడా ఈడీ అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సాహితీ సంస్థకు చెందిన ఆస్తులతో పాటు సంస్థతో లావాదేవీలు నిర్వహించిన పలు సంస్థలకు చెందిన ఆస్తులను ఈడీ అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. కేసు వాదనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story