- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సదాశివనగర్‌లో కలకలం.. బంగారం షాపు దగ్ధం.. 'మార్వాడి గో బ్యాక్' పనేనా!
by Muthe.Rajitha |
ఓ అగ్నిప్రమాదం కామారెడ్డిలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌లో ఆదివారం సాయంత్రం షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఓ అగ్నిప్రమాదం కామారెడ్డిలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌లో ఆదివారం సాయంత్రం షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న ఒక మార్వాడీ బంగారం దుకాణంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఫర్నీచర్ దగ్ధమైంది. రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘటనా స్థలానికి చేరుకొని. దర్యాప్తు ప్రారంభించారు. కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తప్పుడు ప్రచారం చేసి, ప్రజల్ని రెచ్చగొట్టి, అశాంతికి కారణం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
Next Story






