- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన రష్యా విమానం.. 49 మంది దుర్మరణం
రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రష్యన్ ప్యాసింజర్ విమానం ఇవాళ మధ్యాహ్నం టిండా నగరానికి బయలుదేరింది.

దిశ, వెబ్‌డెస్క్: రష్యాకు చెందిన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన రష్యన్ ప్యాసింజర్ విమానం ఇవాళ మధ్యాహ్నం టిండా నగరానికి బయలుదేరింది. అయితే, ఫ్లైట్ చైనా సరిహద్దులోని అమూర్ ప్రాంతం వద్దకు చేరుకోగానే ఏటీసీతో సంబంధాలు తెగి కుప్పకూలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 43 మంది ప్రయాణికులతో పాటు.. ఆరుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. విషాద వార్త తెలుసుకుని మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీ (Federal Air Transport Agency) ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఫ్లైట్ అమూర్‌లోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ తెలిపింది. ఖబరోవ్స్క్-బ్లాగోవెష్‌చెన్స్క్-టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్య స్థానానికి చేరుకొనే సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్లుగా పేర్కొన్నారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా ఎయిర్‌పోర్టు సమీపంలోనే ఫ్లైట్ కూలిపోయినట్లుగా గుర్తించారు.






