బెంగుళూరులో కిలాడీ కపుల్.. యజమాని ఇంటికి కన్నం వేసి రూ.18కోట్లు మాయం

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో అన్నంపెట్టిన ఇంటికే ఓ ప‌నిమ‌నిషి క‌న్నంవేసింది. భ‌ర్తతో క‌లిసి ఏకంగా 18కోట్ల విలువ‌గ‌ల బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు మ‌రియు డ‌బ్బును దొంగ‌లించింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

బెంగుళూరులో కిలాడీ కపుల్.. యజమాని ఇంటికి కన్నం వేసి రూ.18కోట్లు మాయం
X

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో అన్నంపెట్టిన ఇంటికే ఓ ప‌నిమ‌నిషి క‌న్నంవేసింది. భ‌ర్తతో క‌లిసి ఏకంగా 18కోట్ల విలువ‌గ‌ల బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు మ‌రియు డ‌బ్బును దొంగ‌లించింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ఘ‌ట‌న బెంగుళూరులోని మ‌రాథ‌హ‌ల్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. తొమ్మిది నెల‌ల క్రితం శివకుమార్ అనే బిల్డర్ ఇంట్లో ప‌నిచేసేందుకు నేపాల్ నుండి దినేష్, క‌మ‌ల‌, అంబిక అనే వ్య‌క్తులు వ‌చ్చారు. కాగా ఆదివారం ఓ ఫంక్ష‌న్ ఉండ‌టంతో కుటుంబం అంతా అక్క‌డ‌కు వెళ్లారు.

దీంతో అదే మంచి అవ‌కాశంగా భావించిన ప‌నివాళ్లు మ‌రో ముగ్గురితో క‌లిసి దొంగతనానికి పాల్పడ్డారు. వంట మనిషి కమల, సెక్యురిటీ గార్డు దినేష్ భార్య భర్తలు కాగా మరో నలుగురితో కలిసి ప్లాన్ వేశారు. ఇంట్లో ఉన్న 11.5 కిలోల బంగారం, వజ్రాలు, 5కేజీల వెండి, రూ.11.5 లక్షల డబ్బును దోచుకున్నారు. అనంతరం అక్కడ నుండి పరార్ అయ్యారు. వీళ్లు పనిలో చేరి కేవలం 20రోజులే అవుతుండగా నమ్మకంగా కనిపించడంతో యజమాని కుటుంబం ఇంటిని అప్పజెప్పి ఫంక్షన్ కు వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Next Story