- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర.. నలుగురు రౌడీషీటర్లు అరెస్ట్
by Gantepaka Srikanth |
అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Reddy) హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Reddy) హత్యకు కుట్ర పన్నిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలు, వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించారు. శ్రీధర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియోలో కనిపించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. జగదీష్, మహేష్, వినీత్, మల్లి లను అదుపులోకి తీసుకున్నారు. హత్య కుట్రపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన అనుచరులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Next Story






