బైక్ పైనే శృంగారం.. ఓ యువతి, ఇద్దరు యువకులు.. మధ్యలో కూర్చోబెట్టుకుని.. ఛీ ఛీ

by Disha Web Desk 20 |
బైక్ పైనే శృంగారం.. ఓ యువతి, ఇద్దరు యువకులు.. మధ్యలో కూర్చోబెట్టుకుని.. ఛీ ఛీ
X

దిశ, వెబ్ డెస్క్ : కాలం మారిన కొద్ది యువతీయువకుల చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. వారి చేష్టలతో ఎవరికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ, చూసే వారికి మాత్రం మతి పోగొడుతున్నారు. ఎవరైనా చూసి ఏమనుకుంటారో అన్న జంకు, బిడియం లేకుండా బరితెగిస్తున్నారు. ఆ మధ్య లక్నోలో ప్రేమజంట బైక్‌ పై చేసిన రొమాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు మరో వీడియో అంతకన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలో హసన్‌పూర్‌ గజ్రౌలా రోడ్డులో ఓ ప్రేమజంట రన్నింగ్ బైక్‌ పైనే ముద్దు ముచ్చట కానిచ్చేశారు. ముందు వ్యక్తి బైక్ నడుపుతుంటే వెనక కూర్చున్న యువకుడు మధ్యలో ఉన్న యువతికి హగ్గులు ఇస్తూ, ముద్దులు పెడుతూ రొమాన్స్ చేశారు.

అది కాస్త రోడ్డుపై వెళ్తున్న వారి కంట పడింది. ఆ దృష్యాన్ని చూసిన జనాలు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. మరి కొంతమంది ఈ జంట బైక్‌ పై చేస్తున్న రొమాన్స్‌ని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. యువతి, యువకుడు చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఆడవాళ్లు ఇంతలా బరితెగిస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన పోలీసులు ఆ ప్రేమజంటపై కేసునమోదు చేశారు. పబ్లిక్ ప్లేసులో న్యూసెన్స్‌ చేసిన జంట ఎవరూ అంటూ ఆరా తీస్తున్నారు. వీడియోలో కనిపించిన ద్విచక్రవాహనం నెంబర్ ఆధారంగా వారికోసం అన్వేషిస్తున్నారు.



Next Story

Most Viewed