మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎంలో చోరీ.. అతని పైనే అనుమానం..?

by Disha Web Desk 11 |
మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎంలో చోరీ.. అతని పైనే  అనుమానం..?
X

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధి కేపీహెచ్​బీకాలనీ మూడవ ఫేజ్​లోని బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర ఏటీఎంలో చోరి జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి 2:45 గంటలకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏటీఎం లోపలికి ప్రవేశించి నకిలీ తాళం చెవితో ఏటీఎం బాక్స్​ను తెరిచి అందులోని 5 లక్షల రూపాయలను దొంగిలించి పరారయ్యాడు. శనివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

సీసీ కెమెరా పుటేజీలో ఉన్న వ్యక్తి బ్యాంక్​లో డబ్బులు డిపాజిట్​ చేసే వాహనంతో పాటు ఉండే సిబ్బందిగా గుర్తించినట్లు సమాచారం. పని చేస్తున్న కంపెనీనే మోసం చేసి ఏటీఎం నకిలీ తాళం చెవిని తయారు చేసుకుని పథకం ప్రకారం డబ్బులు దొంగిలించినట్టు సమాచారం. కాగా నిందితుడిని బాలానగర్​ సీసీఎస్​ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. పథకం ప్రకారం చోరికి పాల్పడిన దొంగ ఏటీఎంలోని సీసీ కెమెరాలకు చిక్కడంతో బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలిపారు.


Next Story