- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
47ఏళ్ల మహిళతో 20ఏళ్ల కుర్రాడి ఎఫైర్.. రాత్రంతా రొమాన్స్.. తెల్లారేసరికి ఇల్లు గుల్లా..
ఉత్తరప్రదేశ్ ఫుల్పూర్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన ఇంట్లో తనే దొంగతనం చేసిన భార్య.. నిజంగానే దొంగతనం జరిగిందని భర్తను నమ్మించింది. ఆ తర్వాత చర్యలు ఏమీ ఉండవని.. లవర్‌తో కలిసి కొట్టేసిన సొమ్ముతో హ్యాపీగా ఎంజాయ్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఫుల్పూర్‌లో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన ఇంట్లో తనే దొంగతనం చేసిన భార్య.. నిజంగానే దొంగతనం జరిగిందని భర్తను నమ్మించింది. ఆ తర్వాత చర్యలు ఏమీ ఉండవని.. లవర్‌తో కలిసి కొట్టేసిన సొమ్ముతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంది. కానీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంటి దొంగ తనే అని తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రీన్ అనే మహిళకు 47ఏళ్లు. కానీ ఆమె తనకన్నా చిన్న వాడైన షహనవాజ్(20)తో ఎఫైర్ నడిపిస్తుంది. భర్త షాహిద్ పని మీద ఊరికి వెళ్లిన ప్రతీసారి అతన్ని పిలిపించుకుని ఎంజాయ్ చేస్తుంది. ఇలాగే సెప్టెంబర్ 21న కూడా ప్రియుడిని ఇంటికి ఆహ్వానించి.. రాత్రంతా రొమాన్స్ చేసింది. తెల్లారాక ఇద్దరు కలిసి ఇంట్లో ఆరు వేల రూపాయల నగదు, లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొట్టేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరగ్గా.. తర్వాతి రోజు వచ్చిన భర్తకు ఇంట్లో దొంగతనం జరిగిందని.. నగలు, డబ్బు పోయాయని చెప్పింది. దీంతో ఆమెను నమ్మిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. అందులో షహనవాజ్ ఇంట్లోకి ఎంటర్ అయినట్లు కనిపించింది. ముందుగా అతను దొంగ అని మాత్రమే అనుకున్నారు కానీ ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇంట్లోకి ప్రవేశించడం కనిపించడంతో.. తమదైన స్టైల్లో విచారించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ బయటపడింది. మొత్తానికి సెప్టెంబర్ 26న పోలీసులు ఆఫ్రీన్, షహనవాజ్‌ను అరెస్ట్ చేసి.. డబ్బు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.






