- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
by Sujitha Rachapalli |
ఛత్తీస్‌గఢ్ కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అకల్ఘరియా గ్రామ సమీపంలో రాయ్‌పూర్ - జబల్పూర్ నేషనల్ హైవేపై ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ కబీర్‌ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అకల్ఘరియా గ్రామ సమీపంలో రాయ్‌పూర్ - జబల్పూర్ నేషనల్ హైవేపై ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన పది మంది మధ్యప్రదేశ్ కాన్హా నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బిసల్పూర్‌కు రైలు క్యాచ్ చేసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. గాయపడిన మరో ఐదుగురిని ముందుగా దగ్గరలోని ఆస్పత్రికి, ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






