Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా మంత్రి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు

by Shiva |
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా మంత్రి, ఎమ్మెల్సీకి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో మహిళా మంత్రికి తీవ్ర గాయాలైన విషాద ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బెళగావి (Belagavi)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక కేబినెట్‌లో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్ (Lakshmi Hebbalkar), ఆమె సోదరుడు ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి (Chennaraj Hattiholi) కలిసి కారులో బెంగళూరులో వివాహానికి హాజరై తిరిగి బెళగావికి వస్తున్నారు.

ఈ క్రమంలోనే కిత్తూరు తాలుకా అంబడగట్టి గ్రామ శివారులోకి రాగానే వారి కారుకు ఎదురుగా వీధి కుక్క అడ్డు వచ్చింది. దీంతో అప్రత్తమైన డ్రైవర్ ఆ కుక్కను తప్పించబోయే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న భారీ వృక్షాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ (Lakshmi Hebbalkar) ముఖం, వెన్నుముఖ భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అదేవిధంగా ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి (Chennaraj Hattiholi) తలకు గాయమైంది. గమనించిన స్థానికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు స్పాట్‌కు చేరుకుని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed