Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమండ్రి (Rajahmundry)లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని రాజమండ్రి (Rajahmundry)లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కావేరి ట్రావెల్స్‌ (Kaveri Travels)కు చెందిన బస్సు 50 మందితో విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు బయలుదేరింది. ఈ క్రమంలోనే బస్సు దివాన్‌ చెరువు (Diwan Cheruvu) హైవేపై అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ దుర్ఘటనలో కోమలి (Komali) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజమండ్రి (Rajahmundry) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story