- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేపాల్‌లో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి!
నేపాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో అదుపుతప్పి ఓ ప్రైవేట్ జీపు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది లోయలో పడి మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో అదుపుతప్పి ఓ ప్రైవేట్ జీపు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న 17 మంది లోయలో పడి మృతి చెందారు. మృతుల సంఖ్య 20కి పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. జీపు పడిన లోయ దాదాపు 700 మీటర్ల లోతు ఉంటుందని సమాచారం. జలలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వర్షం కారణంగా రోడ్డు బురదమయం కావడంతో జీపు జారిపడిందని పోలీసులు చెబుతున్నారు. వర్షం, బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. క్షతగాత్రులను వెలికితీసేందుకు పోలీసులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. జీపులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా ఖచ్చితంగా తెలియకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






