జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. మంటల్లో చిక్కుకుని ఇద్దరు సజీవ దహనం..

by Sujitha Rachapalli |

మధ్యప్రదేశ్ మోవ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్గొండ పీఎస్ పరిధిలోని నాందేడ్ బ్రిడ్జి సమీపంలో వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతినగా.. ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న నలుగురు బయటకు

జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. మంటల్లో చిక్కుకుని ఇద్దరు సజీవ దహనం..
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ మోవ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బద్గొండ పీఎస్ పరిధిలోని నాందేడ్ బ్రిడ్జి సమీపంలో వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. వాహనాలు పూర్తిగా దెబ్బతినగా.. ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న నలుగురు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా.. ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. సహాయక చర్యలు కొనసాగాయి. గాయపడిన ఇద్దరిని మోవ్ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇండోర్ ఎంవై హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపించిన పోలీసులు.. వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. అతి వేగం, ఓవర్ టేకింగ్ ప్రమాదానికి కారణమని.. రెండు కార్లు ఢీకొన్న తర్వాత కొన్ని మీటర్ల దూరం వెళ్లాయని తెలిపారు.

Next Story