- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
రోడ్డు ప్రమాద ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాద ఘటనలు ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది మరణిస్తుండగా మరికొందరు తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలు అవుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. జిల్లాలోని చిన్నమండెం మండలం దేవలంపల్లి చెక్ పోస్ట్ వద్ద అంబులెన్స్, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. బెంగుళూరు నుండి కడపకు కుటుంబ సమేతంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ప్రవీణా 33, శ్రీకాంత్ 30 మరణించారు. అంతేకాకుండా మరో నలుగురికి గాయాలు అయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ కు సైతం స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






