ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15మందికి గాయాలు

by Ajay Maddhiboyina |

ఏపీలో ఘోర రోడు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా దేవీప‌ట్నం మండ‌లం అంగులూరు వ‌ద్ద టాటా మ్యాజిక్ వాహ‌నం ప్రమాదానికి గురైంది.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఘోర రోడు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా దేవీప‌ట్నం మండ‌లం అంగులూరు వ‌ద్ద టాటా మ్యాజిక్ వాహ‌నం ప్రమాదానికి గురైంది. గండి పోచ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకోగా ఒక‌రు మ‌ర‌ణించారు. మ‌రో 15 మందికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. బాధితులు పాల‌కొల్లు వాసులు గుర్తించారు. ప్ర‌స్తుతం స‌హాయ‌క‌చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. క్ష‌త‌గాత్రుల‌ను స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. టాటా మ్యాజిక్ ట్రాలీ బోల్తా ప‌డ‌టంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు చెబుతున్నారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు.

Next Story