Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-18 07:23:16  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లో చోటుచేసుకుంది.

Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హిందూపురం (Hindupuram) చెందిన నలుగురు కలిసి బొలేరో (Bolero) వాహనంలో యాద్గిర్‌ జిల్లా (Yadgir District)లోని షహర్‌పూర్‌ (Shaharpur)కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో వారి బొలేరోను ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఝటనలో నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story