- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (Tiruvannamalai) సమీపంలో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (Tiruvannamalai) సమీపంలో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిండివనం (Thindivanam) వైవు వెళ్తున్న ప్రభుత్వ బస్సును కుట్టుకలం (Kuttakalam) సమీపంలోని సోమసిపాడి (Somasipadi) గ్రామం వద్ద కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న నలుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు కిల్పెన్నత్తూర్ (Kilpennathur) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తిరువణ్ణామలై (Tiruvannamalai)బ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టబోతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






