పైన పండు.. లోపల పచ్చి కాయ! ‘కెమికల్’ మాయాజాలం గుట్టు రట్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-04 05:19:24  IST  )

హైదరాబాద్ గోషామహల్లో కెమికల్స్‌తో మామిడి పండ్లను మక్కిస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పైన పండు.. లోపల పచ్చి కాయ! ‘కెమికల్’ మాయాజాలం గుట్టు రట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: చూస్తేనే నిగనిగలాడుతూ వెంటనే తినాలనిపించేలా మామిడి పండ్లు నిజానికి విష గుళికలని తేలింది. గోషామహల్ (Goshamahal), ఆసీఫ్ నగర్ కేంద్రంగా సాగుతున్న భారీ మామిడి కల్తీ ముఠా గుట్టును ఇవాళ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశ్వసనాయ సమాచారం మేరకు గోషామహల్, ఆసీఫ్ నగర్ పరిధిలోని కొన్ని పండ్ల నిల్వ చేసే గోదాములపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అక్కడ సహజంగా పండాల్సిన మామిడి కాయలను రసాయనాలతో బలవంతంగా పండిస్తున్నట్లు గుర్తించారు. ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమైన ఎథిలిన్ (Ethylene) ప్యాకెట్లను మామిడి కాయల మధ్య ఉంచి, అవి వేగంగా రంగు మారేలా చేస్తున్నారు. అయితే, ఈ రసాయనాల ప్రభావంతో పచ్చి కాయలు కూడా కేవలం గంటల వ్యవధిలో పసుపు పచ్చని రంగులోకి మారిపోతాయి. బయటకి పండులా కనిపించినా, లోపల మాత్రం అవి పచ్చిగానే ఉంటాయి.

కల్తీ మామిడిని గుర్తించడం ఎలా?

రసాయనాలతో పండిన పండ్లు మొత్తం ఏకరీతిగా పసుపు రంగులో ఉంటాయి. సహజంగా పండిన పండ్లలో అక్కడక్కడా ఆకుపచ్చని ఛాయలు ఉంటాయి. కట్ చేసి తిన్నప్పుడు పండు తీపిగా కాకుండా, పచ్చికాయలా పుల్లగా లేదా చప్పగా ఉంటుంది. కెమికల్ పండ్లు త్వరగా కుళ్లిపోతాయి లేదా లోపల నల్లగా మారుతాయి. వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కూడా వేరే రసాయనాలను వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇలాంటి రసాయనాలతో పండిన మామిడి పండ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Next Story