రాజస్థాన్‌లో కూలిన రెస్టారెంట్ భవనం.. ఇద్దరు మృతి

by Ajay Maddhiboyina |

రాజ‌స్థాన్‌లో రెస్టారెంట్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెంద‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కోట‌లోని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లో కూలిన రెస్టారెంట్ భవనం.. ఇద్దరు మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: రాజ‌స్థాన్‌లో రెస్టారెంట్ భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెంద‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. కోట‌లోని జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గాయ‌ప‌డిన‌వారిని చికిత్స కోసం మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కూలిన భ‌వ‌నం ఎల్ల‌ప్పుడూ ర‌ద్దీగానే ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో భ‌వ‌నంలో చాలా మంది ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు. ఎంత‌మంది భ‌వ‌నంలో చిక్కుకుపోయారు అనేది ఇంకా తెలియ‌లేదు. ప్ర‌మాదం జ‌రిగిన వెంటనే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో రెస్క్యూ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. అంబులెన్స్ లు, డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి. ఘటనా స్థలానికి భారీగా ప్రజలు చేరుకోగా పోలీసులు వారిని అదుపుచేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగటంతో శితిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడం కష్టం అవుతోంది.

Next Story