- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేసిన తప్పే మళ్లీ చేసి జైలుకు
by Sridhar Babu |
చేసిన తప్పే మళ్లీ చేసి పోలీసులకు దొరికిన ఇద్దరు జైలుకు వెళ్లారు.

X
దిశ, సుల్తానాబాద్ : చేసిన తప్పే మళ్లీ చేసి పోలీసులకు దొరికిన ఇద్దరు జైలుకు వెళ్లారు. గుడుంబా విక్రస్తూ వీరు పట్టుబడటంతో అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్, ఎస్సై కేఎస్ఎస్ ఎన్ రాజు తెలిపారు. మండల కేంద్రంలోని మార్కండేయ కాలనీకి చెందిన బండారి స్వాతి, వడ్డెరకాలనీ శాంతినగర్ కు చెందిన కోట స్వరూప గతంలో గుడుంబా విక్రయించగా అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు తహసీల్దార్ ముందు హాజరు పరచడంతో మరోసారి సారా విక్రయించమని ఒప్పుకున్నారు. కానీ మళ్లీ గుడుంబా విక్రయిస్తుండటంతో బుధవారం వారిని రిమాండ్ చేసి కరీంనగర్ జైలుకు తరలించినట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు.
- Tags
- jail
Next Story






