రైల్వే ట్రాక్‌పై రీల్స్.. నిండు ప్రాణం బలి

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖటోలీ రైల్వే స్టేషన్‌లో రీల్స్ చేస్తున్న యువకుడు దురదృష్టవశాత్తు మరణించాడు. దీంతో విషాద వాతావరణం నెలకొంది. రైల్వే ట్రాక్‌పై స్నేహితులతో కలిసి రీల్స్ చేస్తుండగా..

రైల్వే ట్రాక్‌పై రీల్స్.. నిండు ప్రాణం బలి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్‌నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఖటోలీ రైల్వే స్టేషన్‌లో రీల్స్ చేస్తున్న యువకుడు దురదృష్టవశాత్తు మరణించాడు. దీంతో విషాద వాతావరణం నెలకొంది. రైల్వే ట్రాక్‌పై స్నేహితులతో కలిసి రీల్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా గూడ్స్ రైలు రావడంతో దానికింద పడిపోయి ప్రాణాలు వదిలాడు. స్నేహితులు సకాలంలో తప్పుకుని ప్రాణాలతో బయటపడినా.. అతను తప్పుకోలేకపోయాడు. దీంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. కాగా.. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు ఆర్పీఎఫ్ పోలీసులు. ఇక కొన్నాళ్లుగా ఇక్కడి యువకులు ఇలాగే ట్రాక్‌పై వీడియోలు తీస్తున్నారని.. ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు స్థానికులు.

Next Story