HYD: రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి దారుణ హత్య

by Gantepaka Srikanth |

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్(Kushaiguda Police Station) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

HYD: రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్(Kushaiguda Police Station) పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy)ని కొందరు గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో శ్రీకాంత్ రెడ్డి ఇంటిబయటే నరికి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న కుషాయిగూడ పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే కాలనీ వాసులంతా చూస్తుండగానే శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కొందరు అడ్డుపడగా వారిని కత్తులతో బెదిరింపులకు గురిచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story