- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలోని బృందావన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

X
దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని బృందావన్ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే రియాక్టర్లు పేలి ఈ సంఘటన సంభవించినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో మంటలు ఎగిసి పడుతుండడంతో ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరచుగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో వందలాది ఫార్మా బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఉండడంతో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్న పరిశ్రమ యాజమాన్యాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు.
Next Story






