- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pashamylaram : సిగాచీ పరిశ్రమలో పేలుడు.. మృతుల్లో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 పైగా మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ఘటనలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవాన్ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్ ఉదయం ప్లాంటులోకి వచ్చిన సమయంలోనే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఆయన కారు నుజ్జునుజ్జు అయింది. పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు.
రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.






