రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

by Naga Rani Yarlagadda |

పశ్చిమ బెంగాల్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

రాష్ట్రంలో మరో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హుగ్లీలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..స్థానిక తారకేశ్వర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం (నవంబర్ 7) రాత్రి బాలిక తన అమ్మమ్మ వద్ద నిద్రించింది. గుర్తు తెలియని వ్యక్తి ఆ పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున బాలిక కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకగా.. స్టేషన్ పక్కనే ఉన్న డ్రెయిన్ లో రక్తపుమడుగులో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించి పంపించారు.

చిన్నారి అత్యాచారానికి గురైన విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దాచి పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ కూడా ఫిర్యాదు తీసుకోకుండా పంపించేశారని వాపోయారు. మరోసారి చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. సీఎం మమతా బెనర్జీ పాలనలో ఇలా జరగడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యాచారాన్ని దాచి ఉంచేందుకు డాక్టర్లు, పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. నిందితులను కాపాడాలని ఇలా చేశారా? వాళ్లు అధికారులా లేక సీఎం మద్దతు దారులా ? అని బీజేపీ నేత సువేందు అధికారి ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Next Story