మహిళా షూటర్‌పై అత్యాచారం.. ముగ్గురు నిందితుల అరెస్ట్

by Kema Shiva Kumar |

షూటింగ్ పోటీలకు హాజరైన 23 ఏళ్ల మహిళా షూటర్‌పై ఓ హోటల్ గదిలో అత్యాచారం జరిగిన ఘటన హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్ (Faridabad) నగరంలో చోటుచేసుకుంది.

మహిళా షూటర్‌పై అత్యాచారం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: షూటింగ్ పోటీలకు హాజరైన 23 ఏళ్ల మహిళా షూటర్‌పై ఓ హోటల్ గదిలో అత్యాచారం జరిగిన ఘటన హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్ (Faridabad) నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు భివానీ (Bhiwani) ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి మంగళవారం తన స్నేహితురాలితో కలిసి ఫరీదాబాద్‌లోని షూటింగ్ పోటీలకు హాజరైంది. బుధవారం సాయంత్రం పోటీ ముగిసిన తర్వాత, ఆమె స్నేహితురాలు ఫరీదాబాద్‌లో నివసిస్తున్న తెలిసిన వ్యక్తి గౌరవ్‌ను పిలిచి మెట్రో స్టేషన్ వద్ద డ్రాప్ చేయమని కోరింది.

అనంతరం గౌరవ్ (Gowrav) తన స్నేహితుడు సతేంద్ర (Satyendra), మరొకరితో కలిసి వచ్చాడు. నలుగురూ కలిసి ఫరీదాబాద్‌లోనే రాత్రి బస చేసి మరుసటి రోజు వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. హోటల్‌లో రెండు గదులు బుక్ చేసుకుని, ఒక గదిలో పార్టీ చేశారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితురాలి స్నేహితురాలు, గౌరవ్ కలిసి కిందకు వెళ్లిన సమయంలో గదిలో ఉన్న సతేంద్ర యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితురాలు తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలు ఈ విషయం మరో తెలిసిన వ్యక్తికి చెప్పింది. అనంతరం నిందితుడిని గదిలో లాక్ చేసి పోలీసులకు సమాచారమిచ్చింది. ఈ మేరకు పోలీసులు హోటల్‌కు చేరుకుని సతేంద్ర, గౌరవ్, బాధితురాలి స్నేహితురాలిని అరెస్ట్ చేశారు. సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Next Story