- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహితపై అత్యాచారం
ఓ వివాహితకు సంబంధించిన భూమి వివాదంలో ఉండడంతో దాన్ని పరిష్కరిస్తానని ఆమెతో పరిచయం పెంచుకొని తన ఇంటికి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఓ వివాహితకు సంబంధించిన భూమి వివాదంలో ఉండడంతో దాన్ని పరిష్కరిస్తానని ఆమెతో పరిచయం పెంచుకొని తన ఇంటికి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పరిధిలోని సాయినగర్ -1 లో ఘటన బుధవారం రాత్రి జరిగింది. సాయినగర్ ప్రాంతానికి చెందిన దత్తాద్రి అనే వ్యక్తి స్థానికంగా ఉన్న వివాహితకు సంబంధించి భూవివాదం నడుస్తుండడంతో న్యాయపరంగా సహాయం చేస్తానని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
ఆమెను ఇంటికి రప్పించుకోవడం వారింటికి వెళ్లిరావడం చేస్తున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని బుధవారం రాత్రి నిత్యావసర సరుకులు ఇప్పిస్తానని తన ఇంటికి రప్పించుకున్నాడు. తన ఇంట్లోనే మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసి విచారిస్తున్నట్టు నార్త్ రూరల్ సీఐ నరహరి తెలిపారు. వివాహితపై అత్యాచారం చేసిన దత్తాద్రి పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.






