మైనర్ మేనల్లుడు అత్యాచారం చేశాడని కేసు.. అత్తకు 20ఏళ్ల జైలు శిక్ష

by Sujitha Rachapalli |

రాజస్థాన్ ‌అల్వార్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ అయిన మేనల్లుడి అత్యాచారం చేశాడని అత్త కేసు పెట్టింది. కానీ కోర్టు అత్తను దోషిగా తేల్చిన కోర్టు.. ఏకంగా 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మైనర్ మేనల్లుడు అత్యాచారం చేశాడని కేసు.. అత్తకు 20ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ ‌అల్వార్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ అయిన మేనల్లుడి అత్యాచారం చేశాడని అత్త కేసు పెట్టింది. కానీ కోర్టు అత్తను దోషిగా తేల్చిన కోర్టు.. ఏకంగా 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో తిజారా పోలీస్ స్టేషన్ పరిధిలోకి చెందిన వివాహిత.. మైనర్ అయిన మేనల్లుడు తనను అత్యాచారం చేశాడని ఆరోపించింది. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆరు నెలలుగా వేధిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఆరు నెలల్లో 800కుపైగా కాల్స్ ఉండగా.. ముందుగా మైనర్‌పై అనుమానం వచ్చింది. కానీ వివాహితపై అత్యాచారం జరగలేదని విచారణలో తేలింది. బాలుడినే ఎవరు లేని సమయంలో ఇంటికి పిలుచుకునేదని స్పష్టంగా తెలిసింది. ఈ సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించగా.. దోషిగా నిర్ధారించిన కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష వేసింది. అయితే ఈ సమయంలో ఆమెకు తొమ్మిది నెలల కొడుకు ఉండటం, మళ్లీ గర్భంతో ఉండటంతో.. తన కొడుకును తనతోపాటు జైలుకు తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరగా.. ఈ అభ్యర్థనకు ఓకే చెప్పింది కోర్టు.

Next Story