- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి
తమ నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: తమ నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడికి దిగారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. రాజ్ థాక్రే కుమారుడు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు అమిత్ థాక్రేను నాసిక్ జిల్లా సిన్నార్ టోల్ గేట్ వద్ద ఆపారు. దీంతో తమ నాయకుడినే ఆపుతారా అంటూ టోల్ గేట్ వద్ద విధ్వంసం సృష్టించారు. కర్రలతో బిల్ కౌంటర్ల అద్దాలు పగులగొట్టారు. అడ్డొచ్చిన టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. టోల్ సిబ్బందిపై ఆయన అనుచరులు దాడికి దిగారు. టోల్ గేట్ వద్ద విధ్వంసం సృష్టించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మా నాయకుడినే ఆపుతావా అంటూ టోల్ గేట్ మీద దాడి
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2023
మహారాష్ట్ర - రాజ్ థాకరే కొడుకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన నాయకుడు అమిత్ థాకరేను నాసిక్ జిల్లా సిన్నార్ టోల్ గేట్ వద్ద ఆపినందుకు ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు టోల్ గేట్ దాడి చేసి విధ్వంసం సృష్టించారు.#MNS #amitthackeray pic.twitter.com/FGZYOYgOiX






