హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల విధ్వంసం.. ముగ్గురు మృతి

by Malleboina Mahesh |

గంటల వ్యవధిలోనే వందల మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో వర్షాల విధ్వంసం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలు (Heavy rains) హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో విధ్వంసం సృష్టించాయి. గంటల వ్యవధిలోనే వందల మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి (Landslides) ఒక కుటుంబంలోని ముగ్గురు మరణించారు (Three died). అలాగే మండిలోని బస్ స్టాండ్ మునిగిపోయి, పదుల సంఖ్యలో బస్సులు కొట్టుకుపోయాయి. మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్‌గన్ పిటిఐకి మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఇద్దరు వ్యక్తులను రక్షించామని తెలిపారు.

అలాగే వర్షాల కారణంగా మండి జిల్లాలోని ధరంపూర్‌లోని సోన్, భరంద్ డ్రెయిన్లలో వరదలు సంభవించాయని, ఫలితంగా బస్ స్టాండ్ వరదలకు గురై, ఒక వర్క్‌షాప్, పంప్ హౌస్‌లు, దుకాణాలు, 20 కి పైగా బస్సులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షం కురుస్తునే ఉంది. మరో రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రెస్క్యూ సిబ్బందికి తమ ఆపరేషన్ కొనసాగించలేక పోతున్నారు.

Next Story