- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కానింగ్ కోసం వెళ్లిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన రేడియాలజిస్ట్.. మరుసటిరోజు ఫోన్‌లో రికార్డ్ చేసి..
స్కానింగ్ కోసం ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కు వెళ్లిన మహిళా పేషంట్ పై అక్కడ పనిచేస్తున్న రేడియాలజిస్ట్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: స్కానింగ్ కోసం ఒక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ కు వెళ్లిన మహిళా పేషంట్ పై అక్కడ పనిచేస్తున్న రేడియాలజిస్ట్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బెంగళూరు శివార్లలోని అనేకల్ విధాత స్కూల్ మెయిన్ రోడ్డులో ఉన్న ప్లాస్మా మెడినోస్టిక్స్ స్కానింగ్ సెంటర్ లో వెలుగుచూసింది. బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పి ఓ డాక్టర్ వద్దకు వెళ్లగా.. స్కానింగ్ చేయించుకోవాలని సూచించడంతో ఆ స్కానింగ్ సెంటర్ కు వెళ్లింది. అక్కడ రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్న జయకుమార్ స్కానింగ్ చేసే క్రమంలో తన ప్రైవేట్ భాగాలను అసభ్యంగా తాకాడని, తనపట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఇదేమిటని ప్రశ్నిస్తే.. బెదిరించడంతో అక్కడి నుంచి వెళ్లింది.
అతని బండారం బయటపెట్టాలనుకున్న మహిళ.. మరుసటిరోజు మళ్లీ అక్కడికి వెళ్లింది. ఈసారి తన మొబైల్ ఫోన్ లో అతను చేస్తున్నదంతా రికార్డ్ చేసి.. భర్తకు చూపించింది. అతను జయకుమార్ ను ప్రశ్నించగా.. స్థానిక గూండాలతో అతడినీ బెదిరింపజేశాడు. దీంతో దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు BNS64 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం జయకుమార్ పరారీలో ఉండగా.. అతడిని వెతికి పట్టుకునేందుకు రెండు టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు బెంగళూరు విలేజ్ పోలీస్ చీఫ్ సికె బాబా తెలిపారు.






