- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rachakonda CP: ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే నివ్వెరపోయాం
మీర్‌పేట్ హత్య కేసు(Meerpet Murder Case) నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: మీర్‌పేట్ హత్య కేసు(Meerpet Murder Case) నిందితుడు గురుమూర్తిని పోలీసులు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. భార్యను అతి క్రూరంగా చంపినా కూడా గురుమూర్తిలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదని అన్నారు. వెంటక మాధవి హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు విని తాము కూడా నివ్వెరపోయామని అన్నారు. ఇంత క్రూరంగా ఒక మనిషి మీద పగపెంచుకొని చంపుతారా? అని షాకయ్యామని తెలిపారు. హత్యపై ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించాని అన్నారు.
‘గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. రిటైర్ అయ్యి ఇంటికొచ్చారు. మాధవి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ హీటర్‌తో నీళ్లలో మరిగించాడు. ఉడికించిన ముక్కలను మళ్లీ స్టవ్‌పై మంటల్లో కాల్చాడు. కాల్చిన ముక్కలను పొడిగా మార్చాడు. బూడిదను పెయింట్ బకెట్‌లో తీసుకెళ్లి చెరువులో పోసి వచ్చాడు. ఇంట్లో ఆనవాళ్లు లేకుండా చేసిన తర్వాత పిల్లలను తీసుకొచ్చాడు. అమ్మ ఏది అని పిల్లలు అడిగితే ఎక్కడికి వెళ్లిందో తెలియదు అని చెప్పాడు. చంపినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే.. కేసు నుంచి తప్పించుకోవచ్చని గురుమూర్తి భావించాడు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా ప్లాన్ చేశాడు. అంతేకాదు.. భార్యను చంపాలని గట్టిగా నిర్ణయించుకున్న తర్వాతే పిల్లను బంధువుల ఇంటి వద్ద వదిలి వచ్చాడు. ఈనెల 16న భార్య తలను గోడకేసి కొట్టి.. గొంతుపిసికి చంపాడు. గురుమూర్తి దంపతుల స్వస్థలం ప్రకాశం జిల్లా జేపీ చెరువు’ అని రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు.






