దృష్యం సినిమా చూసి, భార్య‌ను మాయం చేసి.. సినిమాను మించిన క‌థ‌

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-11 04:02:19  IST  )

పూణెలో దృశ్యం సినిమా రిపీట్ అయ్యింది. భార్య‌ను హత్య చేసిన భ‌ర్త శ‌వాన్ని మాయం చేసి ఏమీ తెలియ‌న‌ట్టు న‌టించాడు. అంతే కాకుండా అత‌డే పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశాడు. హ‌త్య‌కు ముందు భ‌ర్త నాలుగు సార్లు దృష్యం సినిమా చూసి మ‌రీ ప్లాన్ చేశాడు.

దృష్యం సినిమా చూసి, భార్య‌ను మాయం చేసి.. సినిమాను మించిన క‌థ‌
X

దిశ‌, వెబ్ డెస్క్: పూణెలో దృశ్యం సినిమా రిపీట్ అయ్యింది. భార్య‌ను హత్య చేసిన భ‌ర్త శ‌వాన్ని మాయం చేసి ఏమీ తెలియ‌న‌ట్టు న‌టించాడు. అంతే కాకుండా అత‌డే పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశాడు. హ‌త్య‌కు ముందు భ‌ర్త నాలుగు సార్లు దృష్యం సినిమా చూసి మ‌రీ ప్లాన్ చేశాడు. వివ‌రాల్లోకి వెళితే... స‌మీర్ పంజాబ్ జాద‌వ్ అనే వ్య‌క్తి వ‌ర్జే పోలీస్ స్టేష‌న్ కు స‌మీపంలో భార్య అంజలితో క‌లిసి నివాసం ఉంటున్నాడు. అయితే భార్య‌పై అనుమానం ఉన్న జాద‌వ్ ఆమెను లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీనికోసం ముందుగానే ఇంటికి 2కిమీల దూరంలో ఒక గోదాంను అద్దెకు తీసుకున్నాడు.

ఆ గోదాముకు ఒక ఇనుపపెట్టె, క‌ట్టెల‌ను తీసుకువ‌చ్చి ముందుగానే పేర్చి పెట్టాడు. ఇక అక్టోబ‌ర్ 26న త‌న భార్య‌ను గోదాం ప్రాంతానికి వాకింగ్ తీసుకువెళ్లాడు. అక్క‌డ నుండి అద్దెకు తీసుకున్న గోదాంకు తీసుకువెళ్లి గొంతునులిమి హ‌త్య చేశాడు. త‌ర‌వాత శవంపై పెట్రోల్, కట్టెలు వేసి కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిద‌ను తీసుకెళ్లి న‌దిలో క‌లిపేసి ఏమీ తెలియ‌న‌ట్టు పోలీస్ స్టేష‌న్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే అక్క‌డ సినిమా కాబ‌ట్టి డైరెక్ట‌ర్ క‌థ న‌డిపించాడు. కానీ రియ‌ల్ లైఫ్ పోలీసులు ప‌దిహేను రోజుల్లోనే నిందితున్ని ప‌ట్టుకుని జైలుకు పంపించారు.

Next Story