ED విచారణకు హాజరైన నిర్మాత అల్లు అరవింద్

by Gantepaka Srikanth |

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) ఈడీ విచారణకు హాజరయ్యారు.

ED విచారణకు హాజరైన నిర్మాత అల్లు అరవింద్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్(Producer Allu Aravind) ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం(Ramakrishna Bank Scam) కేసుకు సంబంధించి అరవింద్‌ను ఈడీ(Enforcement Directorate) అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు.ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్‌కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story