TG: రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. నడిరోడ్డుమీద బస్సు దగ్ధం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-30 02:52:04  IST  )

రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో నడిరోడ్డుపై ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus) దగ్ధం అయింది.

TG: రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. నడిరోడ్డుమీద బస్సు దగ్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో నడిరోడ్డుపై ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus) దగ్ధం అయింది. టైర్ పేలి ఒక్కసారిగా శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్.. బస్సులోంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story