- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం.. పట్టపగలు కోర్టులో దారుణ హత్య
by Gantepaka Srikanth |
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సాకేత్ కోర్టు(Saket Court)లో ఖైదీ అమన్ దారుణ హత్య(Murder)కు గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని సాకేత్ కోర్టు(Saket Court)లో ఖైదీ అమన్ దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. మిట్ట మధ్యాహ్నం కోర్టు విచారణ సమయంలో సహచర ఖైదీలు కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్య చేసిన ఆ ఇద్దరు ఖైదీలను ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం గురువారం ఉదయం అమన్‌ను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
Next Story






