- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pranahita river : ప్రాణహిత నదిలో మరో మృతదేహం లభ్యం
by Sridhar Babu |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ప్రాణహిత నదిలో (Pranahita river)గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం ఇప్పటికే లభ్యం కాగా ఆదివారం సాయంత్రం మరొకరి శవం లభించింది.

X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం ప్రాణహిత నదిలో (Pranahita river)గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం ఇప్పటికే లభ్యం కాగా ఆదివారం సాయంత్రం మరొకరి శవం లభించింది. దాంతో ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు (2 dead bodies)లభించినట్టయింది. శనివారం బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాణహిత ఓడరేవు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో జహీర్ హుస్సేన్, ఇర్షాద్ హుస్సేన్ శవాలు ప్రాణహిత తలాయి ఇవ్వడరేవు వద్ద లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మూవీస్ అనే యువకుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగజ్నగర్ డీఎస్పీ రామానుజన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
- Tags
- Pranahita river
Next Story






